Friday, April 17, 2026
Homeమెదక్‌Arrest | దొంగలు దొరికారు

Arrest | దొంగలు దొరికారు

  • ఐదు రోజులలోనే ఛేదించిన పోలీసులు
  • వారి వద్ద నుండి బంగారం స్వాధీనం
  • పోలీసులను అభినందించి రివార్డు అందజేత

గత ఐదు రోజుల క్రితం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో చోరీకి పాల్పడింది దొంగలను పోలీసులు ఐదు రోజులలోనే పక్క ఆధారాలతో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాము మెడలో గోల్డ్ చైన్ ను గుర్తుతెలియని వ్యక్తులు లాక్కొని వెళ్లడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో భాగంగా దుద్దెల గ్రామానికి చెందిన నర్సింలు ,ప్రవీణ్ , శేఖర్ ను పట్టుకొని విచారించగా నేరం అంగీకరించడంతో వారు దొంగిలించిన బంగారు చైన్ ను, దొంగతనానికి ఉపయోగించిన పల్సర్ బైక్ ని స్వాధీనం చేసుకునీ వారిని అరెస్టు చేశారు.

దొంగలను పట్టుకోవడానికి జగదేవపూర్ రాజపేట బచ్చన్నపేట చేర్యాల కొండపాక సిద్దిపేట మండలంలోని 200కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించడం జరిగిందని తెలిపారు. పట్టుకొనుటకు కృషి చేసినటువంటి కాజా, సత్యనారాయణ ,గౌరారం పిఎస్ కు చెందిన పరుశురాములను గజ్వేల్ రూరల్ సిఐ రవిరాజు నగదురువార్డును అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా గజ్వేల్ రూరల్ సీఐ రవి రాజు మాట్లాడుతూ జల్సాలకు అలవాటు పడి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని గంజాయి మత్తుపదార్థాల కేసుల్లో పట్టుపడితే భవిష్యత్తు అంధకారం మని అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపడాలంటే చెడు విన్యాసాలకు దూరంగా ఉండాలని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News