మేడ్చల్ జిహెచ్ఎంసి పరిధిలోని మేడ్చల్ సర్కిల్‌లోని కిష్టాపూర్ డివిజన్ అర్చన కాలనీలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంటిలో మంటలు చెలరేగాయి. బాధితుడు మద్దూరి అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం అల్మారా పూర్తిగా కాలిపోయిందని అందులో ఉన్న బట్టలు, నగదు దగ్ధమై సుమారు లక్షన్నర రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపారు.సంఘటనను గుర్తించిన స్థానికులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ఘటనలో ఎవరికి ప్రాణహాని జరగలేదు.


- Advertisement -
