తన ఉనికిని చాటుకోవడానికే ఎమ్మెల్యే మున్సిపల్ టెండర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్లు మండిపడ్డారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాత టెండర్లను రద్దు చేసి, అవసరమైన చోట కొత్తగా పనులు చేపట్టడంలో తప్పేముందని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకోవడం మానుకోవాలని, అనవసర విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని వారు హితవు పలికారు.
- Advertisement -
