Thursday, April 9, 2026
Homeస్పోర్ట్స్Tennis | అదరగొట్టిన భారత్..

Tennis | అదరగొట్టిన భారత్..

  • న్యూజిల్యాండ్ మ్యాచ్ లో సత్తా చాటిన వైనం..

ప్రతిష్టాత్మక బిల్లీజీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా/ఓషియానా గ్రూపు-1లో భారత్‌ అదరగొట్టింది. థాయ్‌లాండ్‌తో తొలి పోరులో 1-2 వెనుకంజలో నిలిచిన భారత్‌.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో సత్తాచాటింది. బుధవారం జరిగిన రెండో పోరులో భారత మహిళల జట్టు 3-0తో న్యూజిలాండ్‌పై స్వీప్‌ చేసింది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో తడబడ్డ యువ ప్లేయర్లు వైష్ణవి అద్కార్‌, సహజ యమ్లపల్లి పుంజుకుని ప్రత్యర్థిపై ప్రతాపం చూపించారు. తొలుత జరిగిన సింగిల్స్‌లో వైష్ణవి 6-2, 6-4తో ఐషి దాస్‌పై అలవోక విజయం సాధించింది.

గంటన్నర పాటు సాగిన పోరులో వైష్ణవి సాధికారిక ఆటతీరుతో ఆకట్టుకుంది. గత మ్యాచ్‌లో తప్పులను సరిదిద్దుకుంటూ వైష్ణవి మెరుగ్గా రాణించింది. మరో సింగిల్స్‌లో తెలంగాణ యువ ప్లేయర్‌ సహజ యమలపల్లి 6-1, 6-3తో వాలెంటీనా ఇవనోవ్‌పై భారత్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. తన అనుభవాన్ని ఉపయోగిస్తూ సహజ వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. అదే దూకుడు కొనసాగిస్తూ భారత ద్వయం రుతుజా బోస్లే, అంకితారైనా 6-4, 6-2తో కివీస్‌ జోడీ ఎరిన్‌ రౌట్‌లిఫ్‌, మోనిక్‌ బారీపై గెలిచింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News