వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నూతనంగా ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పదవి బాధ్యతలు చేపట్టిన దోమల రజిత ని గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఏనుగల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాసాని వెంకట్, ఉపసర్పంచ్ కానిగంటి విజయ్ కుమార్, శీలం నాగరాజు, మాజీ ప్యాక్స్ చైర్మెన్ గంధం బాలరాజు, మాజీ సర్పంచ్ దమ్మిశెట్టి నర్సింగం, మాజీ ఎంపీటీసీ సాంబారు లింగమూర్తి, ఆత్మ డైరెక్టర్ బుక్క కుమారస్వామి, మాజీ ఉపసర్పంచ్ లు గుండారపు సతీష్ రావు, పెండ్లి రమేష్, వార్డ్ సభ్యులు పూల కుమారస్వామి, నల్లపు రంజిత్, రాధిక లింగస్వామి, మాజీ వార్డ్ సభ్యులు దోని దేవేందర్, పార్టీ సీనియర్ నాయకులు సంపత్ రావు, నల్లపు అనిల్, ఎండీ రహీమ్, నల్లపు అశోక్, సిరుపోతు రాజు తదితరులు పాల్గొన్నారు.
