- అబ్దుల్లాపూర్ మెట్టు పరిసర ప్రయాణికుల సౌకర్యం కోసం
- వివరాలు వెల్లడించిన డిపో మేనేజర్ విజయ్
హయత్నగర్ పరిసర ప్రాంతాలు అయినా పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్, బాటసింగారం, కొత్తగూడెం వరకు ఆఫ్జల్ గంజ్ నుండి మరియు lb నగర్ నుండి ప్రత్యేక షటిల్ బస్సు లు అందుబాటులోకి తెచ్చాము అని హయత్నగర్ 1 డిపో మేనేజర్ విజయ్ అన్నారు.
ఈ బస్సు లు ఉదయం అఫ్జల్గంజ్ నుండి కొత్తగూడెం 07.25, 07.35 ,7.55, 08.10, 10.05, 10.20, 10.35, 10.50, 14.55, 15.10, 15.15, 15.30, 17.35, 17.50,18.05,18.20 కి ఉంటాయి అని తిరుగు ప్రయాణం లో కొత్తగూడెం నుండి 8.55, 9.10, 9.25, 9.40, 11.35, 11.50, 12.05, 12.20, 16.25,16.40,16.55,17.10,19.05,19.20,19.35,19.50 లకు ఏర్పాటు చేసినాము అని, ఈ బస్సులలో ఆధార్ కార్డు చెల్లుబాటు అవుతుంధి.
ఈ బస్సు లు రద్దీ సమయంలో ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఏర్పాటు చేసినాము అని ఇట్టి బస్సు లను సద్వినియోగం చేసుకోగలరని హయత్ నగర్ వన్ డిపో మేనేజర్ విజయ్ సూచించారు.
