Saturday, April 4, 2026
Homeవరంగల్‌తెలంగాణ ఇంటి పెద్దపై దాడి.. ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు!

తెలంగాణ ఇంటి పెద్దపై దాడి.. ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు!

  • అధికారం అండతో అరాచకాలు చేస్తే ప్రజలు క్షమించరు
  • ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బా బు

తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ సాధకుడు, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గజ్వేల్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంపై శనివారం కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడిని ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రస్థాయిలో ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ గుండాలపై ధ్వజమెత్తారు.రాష్ట్రంలో అధికారం అండతో అరాచకాలకు పాల్పడటం కాంగ్రెస్ నైజమని ఆయన మండిపడ్డారు.

శనివారం సాయంత్రం ఆయన స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ పతనంఆరంభమైనదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూపించి ప్రజల మనసు గెలవాల్సింది పోయి, భౌతిక దాడులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని లక్ష్మణ్ బాబు గారు విమర్శించారు.

- Advertisement -

తెలంగాణ లో ఆయనే ఒక చరిత్ర!:

కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, మహోన్నత వ్యక్తిత్వం, అనంత శక్తి, తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన ధీశాలి ఆయన. అలాంటి ఉద్యమ నేత కార్యాలయంపై రాళ్లు వేసి భయపెట్టాలనుకోవడం మీ అవివేకమే అవుతుంది. దాడులు చేసే కొద్దీ బిఆర్ఎస్ పార్టీ మరింత ఉధృతంగా పోరాడుతుందే తప్ప వెనక్కి తగ్గదన్నారు.

ప్రజల పక్షాన సుదీర్ఘంగా పోరాటం:

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి దాడులకు తెరలేపుతోంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల కోసం, సామాన్యుల కోసం బిఆర్ఎస్ గొంతుక వినిపిస్తూనే ఉంటుందనన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. ఈ రోజు మీరు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మీ దాడులకు రెట్టింపు స్థాయిలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తక్షణమే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కాంగ్రెస్ నాయకత్వం ఆపాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ప్రజాక్షేత్రంలో గట్టిగా సమాధానం చెబుతాయని లక్ష్మణ్ బాబు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News