- ఖరాకండిగా చెప్పిన ఇరాన్..
- యుద్ధం ఆగే సూచనలు కనిపించడం లేదు..
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఆగే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. ఒకవైపు భీకర యుద్ధం కొనసాగుతుంటే, మరోవైపు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతి చర్చలకు అడుగులు పడ్డాయి. అయితే, ఈ చర్చలు, శాంతి ఒప్పందం ముందుకు కదలడం లేదు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమయ్యాయి. దీని ప్రకారం త్వరలో రెండు దేశాల మధ్య పాకిస్తాన్, ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగాలి.
కానీ, ఈ చర్చలకు ఇరాన్ అడ్డుచెప్పిందని సమాచారం. అమెరికా అధికారులతో చర్చించేందుకు ఇరాన్ అంగీకరించడం లేదు. అమెరికా డిమాండ్లు ఆమోదయోగ్యంగా లేవని, అందువల్ల అమెరికా అధికారులను కలవాలనుకోవడం లేదని ఇరాన్ అధికారులు పాకిస్తాన్‌కు తెలిపారు. దీంతో చర్చలు నిలిచిపోయాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే, హార్ముజ్ జలసంధి అందుబాటులోకి వస్తుందని భావించిన ప్రపంచ దేశాలకు ఇరాన్ నిర్ణయం ఇబ్బందికరంగా మారనుంది. ట్రంప్ ఇటీవల చర్చల అంశంపై స్పందించారు. ఇరాన్‌తో చర్చల కోసం ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. అయితే, తాము చర్చల్లో పాల్గొనడం లేదని గతంలోనే ఇరాన్ ప్రకటించింది.
