Saturday, April 4, 2026
Homeరంగారెడ్డిPoster Release | జాగృతి సభపోస్టర్ విడుదల

Poster Release | జాగృతి సభపోస్టర్ విడుదల

  • గుర్రం వెంకటేష్, వెంకట్ రెడ్డి

కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోతున్న నూతన రాజకీయ పార్టీని చూసి అన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కిపడుతున్నాయని తెలంగాణ జాగృతి మేడ్చల్ యువనాయకుడు గుర్రం వెంకటేష్ అన్నారు. ఏప్రిల్ 25న మేడ్చల్ జిల్లా మునిరాబాద్ లో కవిత నూతన రాజకీయ పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ సభ సందర్భంగా గుర్రం వెంకటేష్ ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రామిడి వెంకట్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం గుర్రం వెంకటేష్ మాట్లాడుతూ…

ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. మేడ్చల్‌ జిల్లా మునీరాబాద్ వద్ద అద్వయ ఫంక్షన్ హాలులో జెండా ఆవిష్కరణ చేస్తామని ప్రకటించారు. ఆ సమయంలోనే పార్టీ పేరును కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. కార్యకర్తలంతా సమయానికి చేరుకోవాలని, ప్రతి గ్రామం నుంచి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గణేష్, గౌతమ్ రెడ్డి, వంశీ చారి, రాజు, సంతోష తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News