Saturday, April 4, 2026
Homeభక్తిSrisailam | శ్రీశైలం అడవిలో అద్భుతమైన ప్రదేశం..

Srisailam | శ్రీశైలం అడవిలో అద్భుతమైన ప్రదేశం..

  • ఇది ఎంతో మహిమాన్వితమైనది..
    • ఇష్టకామేశ్వరి దేవి పవిత్ర మందిరం..
  • నల్ల మల్ల కొండలో ఎన్నెన్నో అద్భుతాలు..

శ్రీశైలం క్షేత్రంలో మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతికొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. ఈ అమ్మవారిని దర్శించాలంటే అత్యంత ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి నుదురు తాకితే మెత్తగా ఉంటుంది. ఎందరో భక్తులకు అనుభవంలోకి వచ్చిన ఈ అద్భుతానికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

నల్ల ‘మల్లన్న’ కొండలో ఎన్నో అద్భుతాలు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్​లో ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న ముఖ్యమైన ప్రదేశాల్లో శ్రీశైలం దేవస్థానం ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి వెలసిన శ్రీశైలం కొండ మహత్తరమైనది. మోక్షాన్ని ప్రసాదించే శిఖర దర్శనంతో పాటు ఈ పరిసరాల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబికల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం అసాధ్యం. అయినప్పటికీ కొందరు సాహసం చేసి ఈ అద్భుతాలను తిలకిస్తుంటారు. అలాంటి ఓ అద్భుతమైన ఆలయ విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భక్తుల అభీష్టాలు నెరవేర్చే ఇష్టకామేశ్వరి!

భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో ఉన్న ఆలయం ఒక్క శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా ఇలాంటి ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు. ఎందుకంటే ఈ యాత్ర అత్యంత సాహసంతో కూడినది. ఎంతో గుండె ధైర్యం, పూర్వ పుణ్య ఫలం ఉంటే తప్ప అమ్మవారిని దర్శించుకోలేరు.

ఇష్టకామేశ్వరి ఆలయం విశిష్టత

శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరిక నైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. పరమశివుడు, పార్వతీదేవికి ప్రతిరూపంగా ఇష్ట కామేశ్వరి అమ్మవారు ఇక్కడ వెలసి ఉన్నారని భావిస్తారు. పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే పూజలందుకున్న ఈ అమ్మవారిని నేడు సామాన్య ప్రజలు కూడా దర్శించుకుంటున్నారు. అయితే ఆ సంఖ్య చాలా పరిమితం.

ఆకట్టుకునే ఇష్టకామేశ్వరి స్వరూపం

శ్రీశైలానికి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల కొండల్లో ఒక గుహలో వెలసి ఉన్న ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. రెండు చేతులతో తామర మొగ్గలను, మరో రెండు చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్ష మాలతో తపోభంగిమలో, చిరు మందహసంతో అమ్మవారు కనిపిస్తారు. చీకటిగా ఉన్న గుహలో దీపపు వెలుగు మధ్య అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావనను పెంచుతుంది. ఈ గుహ పరిసర ప్రాంతాల్లో కాసేపు కూర్చుని ధ్యానం చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News