జవహర్ నగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సోమ నర్సింగ్ రావు ముదిరాజ్ ఆధ్వర్యంలో, రెడ్డబోయిన ఆంజనేయులు ముదిరాజ్ సమక్షంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధికార కమిటీ ప్రతినిధిగా నూతనంగా ఎన్నికైన మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ నివాసంలో మర్యాదపూర్వకంగా సన్మానం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు శ్రీకాంత్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మాచర్ల సాయికుమార్ ముదిరాజ్, పోచమైన నాగేష్ ముదిరాజ్, యాకయ్య ముదిరాజ్ పాల్గొన్నారు.
- Advertisement -
