Friday, April 3, 2026
Homeనల్లగొండJangaon  | గవర్నర్ ను కలిసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి…

Jangaon  | గవర్నర్ ను కలిసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి…

  • జనగామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ

జనగామ నియోజకవర్గం ఇంచార్జీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లను హైదరాబాద్‌లోని రాజభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులు, ముఖ్యంగా జనగామ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చ జరిగింది.

ప్రాంతంలో నెలకొన్న మౌలిక సదుపాయాల లోపాలు, రహదారులు, తాగునీటి సమస్యలు, విద్య, వైద్య రంగాలకు సంబంధించిన అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రతాప్ రెడ్డి, ప్రజల ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా చూడాలని వివరించారు.

- Advertisement -

ఈ అంశాలపై గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్ల సానుకూలంగా స్పందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు అందించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ భేటీతో జనగామ నియోజకవర్గ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని, పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఊతం లభించే అవకాశముందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఉన్న చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News