- ప్రకటించిన సీఈఓ వేణుగోపాల రెడ్డి..
మే 13న నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 12 వరకు డిజిటల్ పాఠాలు అందించనున్నట్టు టీ-సాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాలిసెట్‌కు రోజు 2 గంటల చొప్పున 84 ఎపిసోడ్లు ప్రసారం చేయనున్నట్టు తెలిపారు. మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో అనుభవం కలిగిన లెక్చరర్లు బోధించే పాఠ్యాంశాలు విద్యా చానల్లో సాయంత్రం 5 గంటల నుంచి 7 వరకు, నిపుణ చానెల్లో రాత్రి 9 నుంచి 11 వరకు ప్రసారమవుతాయని తెలిపారు.
- Advertisement -
