Monday, March 30, 2026
HomeజాతీయంNitish Kumar | శాసనమండలి సభ్యత్వానికి నితీశ్ రాజీనామా..

Nitish Kumar | శాసనమండలి సభ్యత్వానికి నితీశ్ రాజీనామా..

  • త్వరలోనే సీఎం పదవికి కూడా రిజైన్..
  • ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన నితీశ్

బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇటీవల రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని వదులుకున్నారు. సీఎం పదవికి కూడా త్వరలో రాజీనామా చేయనున్నారు. మార్చి 16న బీహార్‌ స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నితీశ్‌ కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అయితే రెండు సభల్లో సభ్యత్వం కలిగి ఉన్నప్పుడు, ఏదో ఒక సభ్యత్వానికి రాజీనామా చేయడానికి 14 రోజుల గడువును రాజ్యాంగం నిర్దేశించింది. కాగా, మార్చి 30తో ఈ గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో రాజ్యసభకు ఎన్నికైన నితీశ్‌ కుమార్‌ తన శాసన మండలి సభ్యత్వానికి సోమవారం రాజీనామా చేశారు. సీఎం పదవికి కూడా త్వరలో రాజీనామా చేయనున్నారు. ఏప్రిల్ 9న నితీశ్‌ కుమార్‌ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News