- శాసన మండలి నుంచి బీ.ఆర్.ఎస్. సభ్యుల సస్పెండ్..
- ప్రకటించిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
- రాఘవ కన్ స్ట్రక్షన్స్ పై చర్చకు పట్టుబట్టిన బీ.ఆర్.ఎస్. సభ్యులు..
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఒక్క రోజు సమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరిస్తున్నట్లుగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్ అవినీతి, అక్రమాలపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. అసెంబ్లీ సెషన్ ముగిసేవరకూ సమావేశాలకు హాజరుకాకుండా బహిష్కరించింది. దీంతో పొంగులేటి కంపెనీ అవినీతిపై ఇవాళ మండలిలో బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. పొంగులేటిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో అవినీతిపై సమాధానం చెప్పలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా మండలి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇలా మండలి సభ్యులపై సస్పెన్షన్ వేటు పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, సస్పెన్షన్‌కు నిరసగా బీఆర్ఎస్ మండలి సభ్యులు చైర్మన్ పోడియం వద్ద నిరసన తెలిపారు. ఈ క్రమంలో మండలి సభ్యులను మార్షల్స్ బలవంతంగా లాక్కెళ్లారు.
