Homeఆదిలాబాద్Shobhayatra | శోభాయాత్రను శోభాయామానంగా నిర్వహించుకోవాలి..

Shobhayatra | శోభాయాత్రను శోభాయామానంగా నిర్వహించుకోవాలి..

నిర్మల్ జిల్లాలో జరిగే శ్రీరామ నవమి శోభాయాత్రకు పోలీసు భారీ బందోబస్తు ఎర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా ఎస్పి జానకి షర్మిల అన్నారు. ఇటు నిర్మల్ తో పాటు అటు బైంసా ప్రాంతాల్లో నేడే శోభాయాత్ర ఉండడంతో పోలీసులందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ శోభాయాత్రను శాంతియుత వాతావరణం జరుపుకోవాలని అన్నారు. పలు ప్రాంతాల్లో వీడియోగ్రఫీ తో పాటు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ఇక నిర్మల్ పట్టణంలో 400 మంది, భైంసా పట్టణంలో 220 పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఎఎస్పి సాయి కిరణ్, ఉపేందర్ రెడ్డిల పర్యవేక్షనలో ఈ పోలీస్ బందోబస్తు కొనసాగుతుందన్నారు.

Sri Rama Navami Shobhayatra Security in Nirmal
- Advertisement -
RELATED ARTICLES

Latest News