Thursday, March 26, 2026
Homeకరీంనగర్Protest | అరకొర కరెంట్‌పై రైతుల ఆగ్రహం

Protest | అరకొర కరెంట్‌పై రైతుల ఆగ్రహం

  • మెదనీపూర్ సబ్‌స్టేషన్ వద్ద బిఆర్ఎస్ ధర్నా
  • 18 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని రైతుల డిమాండ్

కుకునూరు పల్లి మండలం మెదనీపూర్ సబ్‌స్టేషన్ వద్ద అరకొర కరెంట్ సరఫరా సమస్యపై బిఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొని తమ సమస్యలను వ్యక్తం చేశారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో సరైన విద్యుత్ అందక పంటలు ఎండిపోతున్నాయని, తక్కువ వోల్టేజ్ మధ్య మధ్యలో కరెంట్ పోవడం వల్ల మోటార్లు సరిగా పనిచేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు రోజుకు కనీసం 18 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కొండపాక మాజీ వైస్ ఎంపీపీ దేవి రవీందర్ మాజీ ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు కోల సద్గుణ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఆకుల భద్రత సర్పంచ్ లు, మధుమోహన్ దమ్మక్కపల్లి కరుణాకర్ రమేష్ మాజీ సర్పంచ్ లు పుల్లోజి కిరణ్ కుమార్ చారి బచ్చలి మహిపాల్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News