Wednesday, March 25, 2026
Homeమెదక్‌Tragedy | చెరువులో మునిగి వ్యక్తి మృతి

Tragedy | చెరువులో మునిగి వ్యక్తి మృతి

  • అస్తికల నిమజ్జనం సమయంలో విషాదం

మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుంచారం గ్రామానికి చెందిన నాగేష్ చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ 19 మార్చి న నాగేష్ బంధువు మొహన్ దేవేంద్ర నగర్ అంబేద్కర్ నగర్ ప్రాంతంలో మరణించాడు. అనంతరం 23 మార్చి న అంత్యక్రియలు పూర్తయ్యాయి. అదే రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో నాగేష్ తన కుమారుడితో కలిసి కొవ్కూర్ చెరువుకు అస్తికలు నిమజ్జనం చేయుటకు వెళ్లాడు.

సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో చెరువులోకి వెళ్లిన నాగేష్, వారు చూస్తుండగానే నీటిలో మునిగిపోయినట్లు కుమారుడు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, డిఆర్ఎఫ్ బృందం చెరువులో శోధన కార్యక్రమం చేపట్టింది. శోధనలో భాగంగా 24 మార్చి ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో నాగేష్ మృతదేహాన్ని వెలికితీశారు. నాగేష్‌కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News