Wednesday, March 25, 2026
Homeరంగారెడ్డిNegligence | సమస్యలు పట్టించుకోని అధికారులు ఉన్నట్ల లేనట్టా….?

Negligence | సమస్యలు పట్టించుకోని అధికారులు ఉన్నట్ల లేనట్టా….?

  • మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్

అధికారులు ఉన్నారా లేరా అని కిష్టాపూర్ పుడూర్ కార్పొరేషన్ జీహెచ్ఎంసి సిబ్బంది పైన ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ ,ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కిష్టాపూర్ పూడూరు కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రహదారిపై డ్రైనేజ్ పొంగిపొర్లడంతో మురికి నీళ్లు అటుగా వెళ్లే వాహనదారుల పై చిల్లడం జరుగుతుంది అని అన్నారు, స్కూల్ విద్యార్థులు మురికి దుర్వాసన సమస్యతో చాలా ఇబ్బందికరంగా ఉన్నది అని తెలిపారు

సంబంధిత అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు.ఇకనైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా వేడుకుంటున్న అన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్, పవన్, నరేష్ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News