Monday, March 23, 2026
Homeరంగారెడ్డిCPI Leaders | అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం

CPI Leaders | అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం

  • సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ*
  • సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి

స్వాతంత్ర పోరాట యోధులు షహీద్ భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల 95వ వర్ధంతి సందర్బంగా రావి నారాయణ రెడ్డి కాలనీ ఫెజ్ 3 భూ పోరాట కేంద్రంలో AIYF జిల్లా అధ్యక్షులు మధు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారీ మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరు అయ్యి నివాళ్లు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ నునుగు మీసాల వయసులోనే భారత దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలకులకి వ్యతిరేకంగా పోరాటం చేసినా భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ ల పోరాట స్ఫూర్తి నేటి సమాజానికి ముక్యంగా యువతకి ఆదర్శం అని అన్నారు.

బ్రిటిష్ పాలకులని కనీసం క్షమ బిక్ష కూడా అడగకుండా ఉరి తీయబడి తమ ప్రాణాలని తృణ ప్రయంగా వదిలేసారని అన్నారు. రాజకీయాల్లో ఉన్న ఎంతో మందికి భగత్ సింగ్ రాజ్ గురు,సుఖ్ దేవ్ లు ఆదర్శమని వారి స్ఫూర్తితోనే అనేక మంది ప్రజా ఉద్యమల్లోకి వచ్చారాని అన్నారు. వారి ఆశయాల సాధనకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

ప్రపంచ దేశాలపైన అధిపత్యం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవదానికి వ్యతిరేకంగా పోరాడటమే మనం అమరులకి ఇచ్చే గొప్ప నివాళి అని ఇరాన్ పైన అమెరికా మరియు ఇజ్రాయిల్ చేస్తున్న మారణ హోమన్ని నిలిపివేసి ఇరాన్ లో శాంతి స్థాపనకి ఐక్య రాజ్య సమితి కృషి చేయాలనీ అన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలని గంజాయి లాంటి చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా భగత్ సింగ్ లాంటి వాళ్ళ చరిత్రని తెలియజేయాలనీ వారి స్ఫూర్తిని నింపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి లక్ష్మణ్,అబ్దుల్లాపూర్ మెట్ మండల కార్యదర్శి అజ్మీరా హరిసింగ్ నాయక్,బిఓసి జిల్లా కార్యదర్శి దాసరి ప్రసాద్,సిపిఐ నాయకులు సైదులు ముదిరాజ్,AISF జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ నాయక్,గణేష్,పేరాల గోపి,బిచ్చు నాయక్,యాదగిరి,శ్రీధర్ రెడ్డి,అశోక్,పాండు,నీల,ప్రియా,అన్నపూర్ణ,రాణి,నర్సింహా,లక్కీ, పాండు నాయక్, దశరథ్ పవర్, మధుసూర్,మరియు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News