Friday, March 20, 2026
Homeహైదరాబాద్‌Namalagundu | వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

Namalagundu | వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నామాలగుండు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం దేవాలయం చైర్మన్ కాచం రాము,ధర్మకర్తల ఆధ్వర్యంలో దేవాలయ ప్రాంగణం వద్ద గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి నూతన సంవత్సర పంచాంగం పట్టణం కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించారు.ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఉగాది సందర్భంగా వారాసిగూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యవంతంగా దేవాలయ ఆవరణలో కూల్ వాటర్ ఫిల్టర్‌తో పాటు ఆర్‌ఓ వాటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.ఈ సదుపాయాన్ని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి,ఆదం సంతోష్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వారి విగ్రహం కలిగిన ఆంజనేయ స్వామి దేవాలయం సీతాఫల్మండిలో కొలువైయుండి కోరిన కోర్కెలు తీర్చే దేవాలయంగా భక్తుల మన్ననలు పొందుతూ విశిష్టత కలిగి ఉన్నదని ఆయన అన్నారు.

- Advertisement -

భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్తలు మున్నూరు చందు,కైలాస్ అరుణ్ కుమార్,ఆర్.ప్రతాప్ కుమార్,శ్యామల రమణి,నరేష్,సాయికుమార్, వారాసిగూడ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కూరాకుల సుధాకర్,ప్రధాన కార్యదర్శిరాజేష్,కోశాధికారి వీరశేఖర్,గోపరాపు రమేష్,గురుస్వామి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం పంచాంగ శ్రవణం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News