- ప్రజలు గ్యాస్ కొరత పుకార్లను నమ్మవద్దు
- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
జిల్లాలో డొమెస్టిక్, కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. అన్ని గ్యాస్ ఏజెన్సీలలో తగినంత గ్యాస్ అందుబాటులో ఉందని తెలిపారు. గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకున్నవారికి నిర్ణీత సమయంలోపల సిలిండర్లను ప్రజలకు డోర్ డెలివరీ చేస్తున్నట్లు వివరించారు.
ప్రజలకు ఎవరికైనా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు కలిగితే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబరు 91005 77132 ను సంప్రదించవచ్చునని వివరించారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల ఏజెన్సీ లతో సమావేశం నిర్వహించి, ప్రజలకు సరిపడినన్ని సిలిండర్లను సాఫీగా పంపిణీ చేసే విధంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరు గ్యాస్ కొరత అని వస్తున్న అసత్య వార్తలను, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
