సురక్ష సేవా సంఘం తెలంగాణ ఆవిర్భావం నుండి ఎంతో చురుకుగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో తన తోడ్పాటు నందించిన సంఘం క్రియాశీలక సభ్యులు సంతోష్ కుమార్ అనారోగ్యం తో మరణించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనాథ శవాల అంతిమ సంస్కారాల కోసం విజ్ఞాపన వస్తే 346 సందర్భాలలో తనకి తోచిన ఆర్థిక సహాయం అందించి,సురక్ష సేవా సంఘం లో సుస్థిర స్థానం సంపాధించుకున్నారు. సంతోష్ కుమార్ అంతిమ సంస్కారాల కు హాజరైన సురక్ష సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్.
మృతుడు చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ మరణించేటప్పుడు మనవెంట ఏమీ రాదని,కేవలం మనం సంపాదించుకున్న కీర్తి తప్ప అని తెలియజేశారు. అందుకే అందరూ సేవా భావం కలిగి యుండాలని కోరారు. ఈ అంతిమ సంస్కారాలలో సురక్ష సేవా సంఘం న్యాయ సలహా దారులు బుద్దే కమలాకర్, సబ్యులు బాలరాజు, శ్రీనివాస్, తేజ, సత్యన్నారాయణ పాల్గొన్నారు.
