- వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.
తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి ఉత్సవాలను శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఆనాటి కాలంలో పండితులు రాసే రామాయణం సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా మొళ్ల రామాయణాన్ని రాసిన చరిత్ర ‘కుమ్మర’ ఆణిముత్యం మొల్లమాంబకే చెందుతుందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆవునూరి రామన్న, రాష్ట్ర నాయకులు అమరవాది సారంగపాణి, మహబుబాబాద్ జిల్లా అధ్యక్షులు అలువాల శ్రీనివాస్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరి నాగరాజు, జిల్లా నాయకులు ఆవులూరి సాంబమూర్తి, కాసర్ల చంద్రమౌళి, నాంపల్లి యాకయ్య, యూత్ నాయకులు చరణ్ రాజు, అవునూరి అనిల్, కసూరి మహేందర్ (ఆర్మీ) మహేందర్, ఏ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

