అభివృద్ధి చక్రం పరుగులు తీస్తున్నా.. సామాన్యుడి వంటింట్లో పొయ్యి వెలగని దుస్థితి! సిలిండర్ కోసం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ.. కడుపు నింపే గ్యాస్ కోసం కంటి నిండా కన్నీరు!! ఆగుతున్న పరిశ్రమలు.. ఆరుతున్న పొయ్యిలు.. ఇది కేవలం గ్యాస్ కొరత కాదు.. జనజీవన పోరాట నిశ్శబ్ద రోదన! వంట గదిలో మంట ఆరింది.. సామాన్యుడి గుండెల్లో ఆందోళన మొదలైంది. నగరంలో గ్యాస్ లేదు.. పల్లెలో కట్టెలు లేవు.. ఆకలి తీరే దారెటు? ఇది రాబోయే కాలంలో సామాన్యులకు ఎదురయ్యే కష్టాలు..! ప్రభుత్వం మేలుకోవాలి.. కష్టాలను కడతేర్చాలి..
- బీవీఆర్ రావు..
- Advertisement -
