Tuesday, March 10, 2026
Homeహైదరాబాద్‌Arrests | నిరుద్యోగుల మిలియన్ మార్చ్

Arrests | నిరుద్యోగుల మిలియన్ మార్చ్

  • అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు

తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏడాదిలోని రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి నిరుద్యోగులకు మోసం చేసింది. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని దిల్షుక్నగర్ లో నిరుద్యోగుల మిలియన్ మార్చ్ నిర్వహిస్తుంటే ప్రజా పాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈరోజు నిరంకుశ పాలన ద్వారా పరిపాలన కొనసాగిస్తున్నారు.

మెగా డీఎస్సీ, గురుకుల నోటిఫికేషన్లు, మోడల్ స్కూల్ నోటిఫికేషన్లు, ఎస్ఐ పిసి నోటిఫికేషన్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పవర్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టార్, గ్రూప్, జి పి ఓ నోటిఫికేషన్ ఇవ్వకుండా మూడో ఏడాది నడుస్తున్న కూడా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇయాల నిరుద్యోగులకు మోసం చేసిందని చెప్పేసి తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు నిరుద్యోగ చేసిన నాయకులు భూక్య కుమార్ చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి, టీజీపీఎస్సీ ప్రక్షాళన వంటి ఎన్నో హామీలను తన మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగులకు మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.

- Advertisement -

ఒక్క నోటిఫికేషన్ ఇయ్యకుండానే వీళ్ళ అబద్ధాలు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి 60000 ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పేసి అబద్ధాలతో ప్రారంభించి శ్రీధర్ బాబు 70000 ఉద్యోగాలను మంత్రి వివేక్ లక్ష ఉద్యోగాలు పొన్నం ప్రభాకర్ లక్ష ఉద్యోగాలు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మేము మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదని చెప్పేసి అబద్ధాలు మాట్లాడాలనిరుద్యోగులను మోసం చేస్తా ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు హామీలను ఇచ్చి నిరుద్యోగులకు మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాప్పటినుండి 12 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. 2009 డిసెంబర్ 9న కు తెలంగాణ ప్రక్రియ మొదలు పెడుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 21న మరో ప్రకటన చేయడం వల్ల 1900 మంది నిరుద్యోగులు ఆత్మబలిదానం చేసుకున్నారు.

అదేవిధంగా మొదటి ఏడాదిలోను రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేయడం వల్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 మంది నిరుద్యోగులు ఆత్మబలిదానం చేసుకున్నారు అనేసి చెప్పడం జరిగింది. రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ తో పాటు మెగా డీఎస్సీ విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి నిరుద్యోగ హెచ్చరించడం జరిగింది. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిరుద్యోగులను అక్రమ అరెస్టులు చేసి నాగోల్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News