Thursday, March 5, 2026
Homeస్పోర్ట్స్Finn Allen | చరిత్ర సృష్టించిన న్యూజిల్యాండ్ ఓపెనర్..

Finn Allen | చరిత్ర సృష్టించిన న్యూజిల్యాండ్ ఓపెనర్..

  • 33 బంతుల్లో సెంచరీ బాదిన ఫిన్ అలెన్..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 సెమీఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే శతకం బాది ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు.

దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా వేదికగా జరిగింది. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా కూడా ఫిన్ అలెన్ చరిత్రకెక్కాడు. అంతేకాకుండా నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

- Advertisement -

ఇప్పటివరకు ఈ రికార్డు తిలకరత్నే దిల్షాన్ పేరిట ఉండేది. ఆయన 2009 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వెస్టిండీస్‌పై 96 పరుగులు చేశాడు. తాజాగా అలెన్ శతకంతో ఆ రికార్డు చెదిరిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News