- ఇవి పాటిస్తే చాలు.. మీదశ తిరిగినట్లే..
చాలామంది తమ ఇష్టదైవం తోడుండాలనే నమ్మకంతో పర్సులో దేవుళ్ల ఫోటోలను భద్రంగా ఉంచుకుంటారు. అయితే భక్తితో చేసే ఈ పని వాస్తు శాస్త్రం ప్రకారం.. మీకు ఆర్థిక కష్టాలను తెచ్చిపెడుతుందంటే మీరు నమ్ముతారా? పర్సు అనేది లక్ష్మీదేవి నివాస స్థానమని, అక్కడ దేవుళ్ల చిత్రాలను ఉంచడం వల్ల సానుకూల శక్తి కంటే ప్రతికూల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం.. దేవుళ్లు, దేవతల చిత్రాలను పర్సులో ఉంచుకోవడం అశుభంగా పరిగణిస్తారు. మనం పర్సును రకరకాల ప్రదేశాల్లో ఉంచుతుంటాం. ఒక్కోసారి అపవిత్రమైన చోట్ల కూడా పెడతాం. దేవుళ్లను ఎప్పుడూ ఒకే చోట ఉంచి నిష్టతో పూజించాలి కానీ ఇలా పర్సుల్లో పెట్టి ఇష్టం వచ్చినట్లు తిప్పడం వల్ల దోషం కలుగుతుంది. పర్సులో దేవుడి ఫోటోలు ఉంచడం వల్ల సానుకూల శక్తి తగ్గి, క్రమంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దేవుడి ఫోటోలకు బదులుగా పర్సులో కొన్ని వస్తువులను ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు..
నెమలి ఈక: ఇది ప్రతికూల శక్తిని తొలగించి విజయాన్ని అందిస్తుంది.
బియ్యం గింజలు: కొన్ని బియ్యం గింజలను పర్సులో ఉంచడం వల్ల అనవసర ఖర్చులు తగ్గి, సంపద పెరుగుతుంది.
పసుపు కొమ్ము: ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపును పర్సులో ఉంచుకోవడం ఒక మంచి పరిహారం.
అంతేకాకుండా పర్సు రంగు కూడా ముఖ్యమే.. మీ ఆర్థిక పరిస్థితిపై పర్సు రంగు తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం..
నలుపు, నీలం: ఈ రంగుల పర్సులను వాడటం అంత మంచిది కాదు. ఇవి ఆర్థిక స్థితిని దిగజార్చే అవకాశం ఉంది. ఎరుపు, గోధుమ లేదా పసుపు రంగు పర్సులను ఎంచుకోవడం మేలు..
