Wednesday, March 4, 2026
Homeబిజినెస్Stock Market | నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

Stock Market | నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు..

  • మదుపరులను ప్రభావితం చేసిన యుద్ధం..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధంతో పశ్చిమాసియా దేశాల్లో సంక్షోభం నెలకొన్నది. ఇది మదుపరులను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ క్రమంలోనే అమ్మకాల ఒత్తిడి కారణంగా అటు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ), ఇటు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) రెండింటి ప్రధాన సూచీలు 1 శాతానికిపైగా క్షీణించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,048.34 పాయింట్లు లేదా 1.29 శాతం పడిపోయి 80,238.85 వద్ద ముగిసింది.

ఒకానొక దశలోనైతే ఏకంగా 2,743.46 పాయింట్లు లేదా 3.37 శాతం దిగజారి 80 వేల మార్కు కిందికి చేరడం గమనార్హం. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 312.95 పాయింట్లు లేదా 1.24 శాతం కోల్పోయి 25 వేల మార్కుకు దిగువన 24,865.70 దగ్గర నిలిచింది. ఇక ఇంట్రా-డే ట్రేడింగ్‌లో 575.15 పాయింట్లు లేదా 2.28 శాతం నష్టపోయింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News