Tuesday, March 3, 2026
Homeకెరీర్ న్యూస్Agniveer Vayu | అగ్నివీర్ వాయు నియామకాలు..

Agniveer Vayu | అగ్నివీర్ వాయు నియామకాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు ఇటీవల నోటిషికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి ఐఏఎఫ్‌ అగ్నివీర్ వాయు దరఖాస్తులకు మరో ఛాన్స్‌ ఇచ్చింది. అలాగే అభ్యర్ధుల వయోపరిమితిలో సడలింపు ఇచ్చింది. తాజా ప్రకటన మేరకు వయోపరిమితిని 21 నుంచి 22 ఏళ్లకు పెంచినట్లు తెలిపింది. అంటే దరఖాస్తు చేసుకునే వారు జనవరి 1, 2005 నుంచి జులై 1, 2009 మధ్య జన్మించిన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులుగా ఉండాలి.

అలాగే అభ్యర్ధులు సంబంధిత విభాగాల్లో కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌(10+2) లేదా సైన్స్ కాని ఇతర సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ లేదా ఇంటర్‌ ఒకేషనల్‌ లేదా మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి.

- Advertisement -

ఈ అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.550 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ మొత్తం 5 ఫేజ్‌లలో ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇక ఆన్‌లైన్ పరీక్షలు మార్చి 30 లేదా 31 నుంచి ప్రారంభమవుతాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News