ఒప్పో నుంచి మరొక కొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన ఒప్పో కె 14 5 జీ మార్చి 09న భారత మార్కెట్ లోకి విడుదల అవ్వనుంది. ఈ విషయాన్ని కంపెనీ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ప్రకటించింది. అయితే విడుదలకి ముందే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ని ఫ్లిప్ కార్ట్ ద్వారా కంపెనీ విడుదల చేయడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3, ప్రాసెసర్, 7000 ఎం ఏ హెచ్ బ్యాటరీ, 45డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్, 64 ఎంపీ సోనీ కెమెరాతో రానుందని తెలుస్తుంది.
చైనాకి చెందిన ప్రముఖ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ అయిన ఒప్పో, తమ సరికొత్త మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్ అయిన ఒప్పో కె 14 5 జీ ని మార్చి 09, మధ్యాహ్నం 12 గంటలకి భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ని కంపెనీ తమ అధికారిక ఎక్స్ ప్లాట్ ఫారం ద్వారా విడుదల చేయడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ గత ఏడాది విడుదలైన ఒప్పో కె 13 5జీకి అడ్వాన్స్డ్ వెర్షన్ గా అందుబాటులోకి రానుంది.
అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అయిన ఫ్లిప్ కార్ట్ లో దర్శనం ఇవ్వడం జరిగింది. వీటి ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64 మెగా పిక్సెల్ కెమెరా, 45 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది.
