Monday, March 2, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంEncroachments | జన్వాడలో ‘అక్రమాల’ సామ్రాజ్యం..

Encroachments | జన్వాడలో ‘అక్రమాల’ సామ్రాజ్యం..

  • 111 జీఓను ఖూనీ చేస్తున్న రియల్ మాఫియా..!
  • ప్రభుత్వానికి సవాల్ విసురుతున్న వైనం..
  • జీ.హెచ్.ఎం.సి. పరిధిలోనూ నియంత్రణ లేమి..
  • డిప్యూటీ కమిషనర్ కళ్లముందే నిబంధనల ఉల్లంఘన?
  • వ్యవసాయ భూముల్లో రిసార్ట్‌లు, ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు..
  • కూల్చివేతల తర్వాత కూడా మళ్లీ నిర్మాణాలు..
  • అనుమతుల్లేకుండా వాణిజ్య భవనాలు..
  • ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి..

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసు కొచ్చిన 111 జీఓ నిబంధనలను బడా బాబులు బేఖాతరు చేస్తు న్నారు. చట్టాన్ని చుట్టేసి, అధికారుల కళ్లముందే అక్రమ కట్టడాల సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ సాగుతున్న ఈ దందాపై స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు.

నియంత్రణ లేని మున్సిపాలిటీ.. నిమ్మకు నీరెత్తిన యంత్రాంగం..! గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు అధికారులు కొన్ని నిర్మాణాలను కూల్చివేసి చేతులు దులుపుకున్నారు. కానీ, ప్రస్తుతం జన్వాడ నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. మున్సిపాలిటీలో డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణ ఉన్నప్పటికీ, ఆయన కళ్లముందే నిబంధనల ఉల్లంఘన య< ొûచ్ఛగా జరుగుతుండటం విస్మయానికి గురిచేస్తోంది. అధికారులు అక్కడకు వచ్చి వెళ్తున్నారే తప్ప, ఆగని నిర్మాణాలను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

కూల్చివేతలు కేవలం కంటితుడుపు చర్యలేనా..? గతంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన చోటే మళ్లీ భారీ షెడ్లు, రిసార్ట్‌లు వెలుస్తుండటం గమనార్హం. కూల్చివేతలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనా? లేక అధికారుల పరోక్ష సహకారం ఉందా? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సాగు భూములను కన్వర్షన్ చేయకుండానే, ఎలాంటి హెచ్.ఎం.డీ.ఏ., జీ.హెచెం.సి. అనుమతులు లేకుండానే విలాసవంతమైన రిసార్ట్‌లు, ముఖ్యంగా కే కన్వెన్షన్, సమృద్ధి అనే పేర్లతో అక్రమంగా భారీ ఫంక్షన్ హాళ్లువెలుస్తున్నాయి. మరి దీనివెనుక ఎవరున్నారు..?

కొందరు అధికారులు భారీ ఎత్తున ముడుపులు తీసుకుని ఇటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. 111 జీఓ అన్నది ఇక్కడ అమలవుతోందా..?లేదా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి..?

ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.. ప్రజాప్రతినిధుల అండదండలు..? నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన ఫీజులు, పన్నులు కట్టకుండానే ఈ నిర్మాణాలు సాగుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతోంది.

కొందరు ప్రముఖ ప్రజా ప్రతినిధుల అండదండలతోనే ఈ అక్రమ కట్టడాలకు రక్షణ లభిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రియల్ మాఫియా అండతో సాగుతున్న ఈ అక్రమాల పర్వంలో అధికార యంత్రాంగం మౌనం వహించడం వెనుక లక్షల్లో చేతులు మారాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల డిమాండ్: 111 జీఓ ఉనికిని కాపాడాల్సిన బాధ్యత ప్రభు త్వంపై ఉంది. జన్వాడలో జరుగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారు లపై వేటు వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే, చట్టంపై ప్రజలకు ఉన్న నమ్మకం సడలిపోయే ప్రమాదంఉంది. నిర్మాణ అనుమతులు లేవు.. నిబద్ధత అసలే లేదు! ఈ అక్రమ సామ్రా జ్యాన్ని కూల్చేదెవరు? అని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News