Saturday, February 28, 2026
Homeరంగారెడ్డిACB Trap | ఏసీబీ వలలో హోంగార్డు, డాక్టర్

ACB Trap | ఏసీబీ వలలో హోంగార్డు, డాక్టర్

కీసర పోలీస్ స్టేషన్‌లో హోమ్ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న నగేష్‌ను ఏసీబీ అధికారులు శనివారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి నుంచి గాంధీ హాస్పిటల్ డాక్టర్ సందీప్, హోంగార్డు రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ డీఎస్‌పీ గంగసాని శ్రీధర్ తెలిపారు.

ఇటీవల కీసర నితిన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తోటకూర మహేష్ యాదవ్ మరణించగా, పీఎంఓ రిపోర్ట్ కోసం రెండు లక్షల రూపాయలు అడగడంతో, ఆ మొత్తాన్ని తాను ఇవ్వలేనని బాధితుడు 40 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. కీసర ఔటర్ రింగ్ రోడ్‌ సమీపంలో బాధితుడి నుంచి 40 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News