- ఎం. రఘునందన్ రావు, ఎం.పి, మెదక్
స్పందన కల్చరల్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ (స్కోప్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాలలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సహకారంతో బాల్య వివాహాల విముక్త భారత్ రథాన్ని మన మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు . రఘునందన్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ కూడా బాల్య వివాహాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.
మనందరం కూడా ఈ కార్యక్రమానికి సహకరించి బాల్య వివాహాలు జరుగకుండా చూడాలని సూచించారు. ఇందులో స్కోప్ చైర్మన్ డాక్టర్ బండి సాయన్న పాల్గొని మన సంగారెడ్డి జిల్లాలలో బాల్య విముక్తా భారత్ అన్న కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో గ్రామాలలో ఈ ప్రచార రథము చేత అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతున్నది ముఖ్యంగా బాల్యవివాహాలు నిర్వహించే వారందరూ చట్టప్రకారంగా శిక్షావించబడతారు అని తెలిపారు.
1) ఆడపిల్లలకు 18 ఏళ్లలోపు మరియు మగ పిల్లలకు 21 ఏళ్లలోపు పెళ్లి చేస్తే చట్టప్రకారం వారికి తీవ్రంగా శిక్షించబడతారు 2)తల్లిదండ్రులతో సహా బాల్య వివాహాలు నిర్వహిస్తే లక్ష రూపాయల జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష తప్పదు 3) బాల్య వివాహాల నిర్వహణలో పాల్గొన్న వారందరికీ ఇవే శిక్షలు, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 గాని పోలీసు వారి నెంబరు 112 గాని జేరిసి హెల్ప్ లైన్ నెంబర్ 18001027222 నెంబర్ కు కాల్ చేయవచ్చును.
ఈ కార్యక్రమములో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ ఉప్పలయ్య, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ మనయ్య , కౌన్సిలర్ సబిత, కమ్యూనిటీ మొబిలైజర్లు రామా గౌడ్ సావిత్రి, లా అసోసియేషన్ మెంబర్ జగన్ , గోపా కార్యవర్గ సభ్యులు మీరయ్య మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చయ్య, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
