ఉప్పల్ నియోజకవర్గం లోని కాప్రా మండల్ ఈసీఐఎల్ లో పలు పరీక్షా కేంద్రాల కు విద్యార్థులు సకాలంలో చేరుకున్నారు. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా మండల్ దీక్ష జూనియర్ కళాశాల, సి ఎం ఎస్ జూనియర్ కళాశాల ఆదర్శ్ జూనియర్ కళాశాల గౌతమి జూనియర్ కళాశాల ఈసీఐఎల్ లోని పలు జూనియర్ కళాశాలలో , ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆయా సెంటర్లకు విద్యార్థులంతా నిర్ణీత సమయానికి ముందుగానే చేరుకున్నారు. ఒకరిద్దరూ పరీక్ష సమయానికి చివరి నిమిషంలో సెంటర్లోకి చేరుకున్నారు. ఆయన పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు.
- Advertisement -
