Wednesday, February 25, 2026
HomeజాతీయంRahul Gandhi | భరత్ ను అమెరికాకు అమ్మేయదలుచుకున్నారా

Rahul Gandhi | భరత్ ను అమెరికాకు అమ్మేయదలుచుకున్నారా

  • అమెరికాకు లొంగిపోయిన ప్రధాని మోడీ
  • భారతీయుల డాటాను ట్రంప్ చేతిలో పెట్టారు..
  • మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్..

భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందంపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేశారు. మోదీ రాజీపడ్డారని, అమెరికా ఒత్తిడికి తలవంచారని ఆరోపించారు. భోపాల్లో మంగళవారంనాడు జరిగిన కాంగ్రెస్ కిసాన్ మహాచౌపాల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశాన్ని అమ్మేశారని, భారతీయుల డాటాను అమెరికా చేతిలో పెట్టారని మోదీని విమర్శించారు. వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తులతో ముడిపడిన కారణంగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం నాలుగు నెలలుగా నిలిచిపోయింది.

పార్లమెంటు ప్రసంగంలో కేవలం ఆర్మీ మాజీ చీఫ్ నవరణెళి గురించే నేను మాట్లాడలేదు. నా ప్రసంగం పూర్తికాగానే సొంత మంత్రులను కూడా సంప్రదించ కుండా మోదీ ట్రంప్ తో మాట్లాడారు. మహిళా ఎంపీలు దాడి చేయాలనుకున్నారంటూ అబద్దాలు చెప్పారు. దానికి బదులుగా అమెరికాతో డీల్కు రెడీగా ఉన్నట్టు ఆయన సూటిగా చెప్పి ఉండవచ్చు. మోదీ కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది’ అని రాహుల్ అన్నారు.

- Advertisement -

అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ఆదేశంతో ట్రేడ్ ఒప్పందాలను వదులుకోవాలని ఇతర దేశాలు నిర్ణయం తీసుకుంటే, మోదీ మాత్రం మౌనంగా ఉండిపోయారని రాహుల్ విమర్శించారు. ‘ఇదే వేదిక నుంచి మోదీని సవాలు చేస్తున్నాను. డీల్పై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ట్రంప్ ఒత్తిడి కారణంగానే డీల్ను మోదీ రద్దు చేసుకున్నారు.

భారతదేశం అత్యధిక జనాభా కలిగిన దేశం. డాటా కూడా పెద్దదే. కానీ మోదీ మన డాటాను అమెరికాకు ఇచ్చేశారు. ఆయన మీద ఒత్తిడి లేకపోతే ఆ పని చేసేవారు కాదు. తన ప్రతిష్ట, రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు దేశాన్ని ఆయన అమ్మేశారు’ అని మోదీపై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News