Tuesday, February 24, 2026
HomeతెలంగాణYadadri | యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాస్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్

Yadadri | యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లాస్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్

ఈరోజు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాగాయత్ బోనగిరి యందు జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షకు జిల్లాలోని వివిధ మండలాల నుండి ఎంపికైన 38 మంది విద్యార్థులు హాజరైనారు ఈ పరీక్ష జిల్లా స్థాయి FPST ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకత ,శాస్త్రీయ దృక్పదము పెంపొందించుకోవడానికి ఇటువంటి పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.

స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాగాయత్ ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులలోని మూఢనమ్మకాలను పారద్రోలాలని సూచించారు జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థులలో సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు FPST అధ్యక్షులు బుస రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు బావి సైంటిస్టులు ఎదగాలని కోరారు FPST జనరల్ సెక్రెటరీ హరినాద్ రెడ్డి మాట్లాడుతూ…

- Advertisement -

ప్రతి విషయం కూడా సైన్స్ తో సంబంధం కలిగి ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి జాన్ ఆఫ్గాన్ మాట్లాడుతూ ఇలాంటి ప్రతిభ పోటీలు విద్యార్థుల ఉన్నతికి చాలా ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో FPST కోశాధికారి వెంకటేశ్వర్లు మరియు వివిధ మండలాల సైన్సు ఉపాధ్యాయులు లింగేశ్వర్ మధుసూదన్ ,నవీన్ కుమార్ ,శ్యాంసుందర్, మాధవి నవీన్ కుమార విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ పరీక్షలో మొదటి స్థానంలో కే శ్రీనివాస్ BC welfare school బోనగిరి విద్యార్థి గైడ్ టీచర్ రజిని , రెండవ స్థానంలో సింగం వివేక్ వర్ధన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల భాగాయత్ బోనగిరి గైడ్ టీచర్ వెంకటేశ్వర్లు, మూడో స్థానంలో బి వర్దన్ ఎస్వీ జడ్పిహెచ్ఎస్ వలిగొండ గైడ్ టీచర్ నవీన్ కుమార్ నిలిచారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News