- అన్నల కోసం కరకగూడెం అడవుల్లో ‘సెర్చ్ ఆపరేషన్’…?
- మావోయిస్టుల సంచారం… ఆచూకీ కోసం పోలీసుల గాలింపు…!
చతీస్ఘడ్ రాష్ట్రం నుండి మావోయిస్టులు రెండు రోజుల క్రితం రహస్యం గా గోదావరి నది దాటి ములుగ-భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారనే పక్కా సమాచారంతో రెండు జిల్లాలో ని పోలీసులు, ప్రత్యేక దళాలతో మంగపేట, పినపాక, మణుగూరు,కరకగూడెం,గుండాల అడవుల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా తెలంగాణ లోకి మావోయిస్టులు చొరబడ్డారనే సమాచారంతో ఈ ప్రాంతాన్ని హై అలెర్ట్ జోన్ గా ప్రకటించినట్లు తెలుస్తోంది…
అయితే శనివారం రాత్రి మొదలు ఆదివారం తెల్లవారుజామున వరకు భారీ స్థాయిలో పోలీసుల వాహనాలు సమీప అటవీ ప్రాంతంలో కనిపిస్తున్నాయని సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు అంటున్నారు.కేంద్రం మావోయిస్టుల ఏరీ వేత కు డెడ్ లైన్ దగ్గరికి రావడంతో “కగార్”స్పెషల్ ఆపరేషన్ తో మిగిలి ఉన్న వారిని కూడా ఆయా ఆపరేషన్ ల ద్వారా అంత మొందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది..
ఇదిలా ఉండగా ఆదివారం మహబూబాబాద్, ములుగుజిల్లా లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల బృందం సభ్యులు అందరూ కూడా కన్నాయిగూడెం మండలo లోని దేవాదుల ప్రాజెక్టు సర్వే సమీక్ష కు వస్తున్న నేపథ్యంలో ములుగు జిల్లా నుండి కూడా అధిక సంఖ్యలో పోలీసు వాహనాలు తాడువాయి, గుండాల, ఏటూరు నాగారం,కన్నాయిగూడెం మండలాల కు చెందిన గ్రామాల,సమీపంలో ఏజెన్సీ ప్రాంతాలకు పోలీసు అధికారులు, బృoధాలుగా విడిపోయి గాలింపు చర్యలకు తరలి వెళ్లినట్లు తెలియవచ్చింది.
