Homeరంగారెడ్డిJawahar Nagar | ఉచిత కంటి పరీక్షల శిబిరం విజయవంతం

Jawahar Nagar | ఉచిత కంటి పరీక్షల శిబిరం విజయవంతం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాప్రా మండల్ జవహర్ నగర్ మదర్ తెరిసా కాలనీలో విన్ విజన్ హాస్పిటల్ అండ్ ఎన్.ఎన్ ఫౌండేషన్ అండ్ బాలవికాస (సిఎస్ఆర్బి) ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ సదుపాయం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి 28వ డివిజన్ ప్రెసిడెంట్, సంఘ సేవకుడు బూడిద వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పేద ప్రజలకు ఇలాంటి హెల్త్ కేర్ సేవలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. సమాజ సేవలో భాగంగా హాస్పిటల్ టీమ్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.

- Advertisement -
Free Eye Checkup Camp At Jawahar Nagar

ఈ శిబిరంలో నాగరాజు మేనేజర్ ఐ కేర్ ఎడ్యుకేషన్, శివ నారాయణ మార్కెటింగ్, నరేష్ మార్కెటింగ్, విజయ్ మార్కెటింగ్, శారిక్ మాలిక్ మార్కెటింగ్, స్రవంతి ఆప్టిఎం, హేమావతి ఆప్టిఎం, మంజుల ప్రోగ్రాం మేనేజర్ బాలవికాస, వసంత ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, వినోద్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, రవి, మంజుల, క్రిస్టినా, శారద, నాగమణి, సాయి చంద్రిక పాల్గొన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు హాజరై సేవలను వినియోగించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News