- కఠినంగా పిసి పిఎన్‌డిటి చట్టాన్ని అమలు చేయాలి
- మేడ్చల్ మల్కాజిగిరి డిఎంహెచ్‌వో డా. ఉమాగౌరి
గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరం అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. ఉమా గౌరి అన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ (పిసి & పిఎన్‌డిటి ) చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని శనివారం డిఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సలహా సంఘం సమావేశంలో ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పిసి మరియు పిఎన్‌డిటీ చట్టం అమలు విధానం, జిల్లాలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్ల పనితీరు, కొత్త మరియు పునరుద్ధరణ నమోదు దరఖాస్తుల పరిశీలన వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయుటకు అవసరమైన సూచనలు మరియు సలహాలను అందించారు.
జిల్లాలోని అన్ని అల్ట్రాసౌండ్ కేంద్రాలు చట్టంలోని నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందిగా,లేని యెడల యాక్ట్ ప్రకారము కఠిన చర్యలు తీసుకొనడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ డా. గీత, జనటిస్ట్ డా. స్వర్ణలత, ఎన్‌జిఒ ప్రతినిధి హైమావతి, డిప్యూటీ డెమో వసంత పాల్గొన్నారు.
