Monday, February 23, 2026
Homeరంగారెడ్డిMother's Day | అమ్మ ప్రేమకు వందనం..

Mother’s Day | అమ్మ ప్రేమకు వందనం..

  • శ్రీ చైతన్య ఐఐటెక్నో పాఠశాలలో మాతృమూర్తుల కార్యక్రమం

ఈ సృష్టిలో స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉంటే అది అమ్మ ప్రేమేనని వక్తలు పేర్కొన్నారు. దమ్మాయిగూడలోని Sri Chaitanya i Techno School ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు స్వప్న రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మాతృమూర్తుల ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

మొదటి తరగతి, రెండవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయుల సమక్షంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి హాజరైన వారిని ఆకట్టుకున్నారు. అమ్మ ప్రేమ గొప్పదనం, త్యాగం, అనురాగం గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. బిడ్డ చెప్పకపోయినా అతని మనసులోని భావాన్ని అర్థం చేసుకోగలిగేది ఒక్క అమ్మ మాత్రమేనని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పిల్లలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. పిల్లల ప్రతిభను చూసి మాతృమూర్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News