Wednesday, February 18, 2026
Homeహైదరాబాద్‌BIS | రాష్ట్రవ్యాప్తంగా బి.ఐ.ఎస్ స్టాండర్డ్స్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి..

BIS | రాష్ట్రవ్యాప్తంగా బి.ఐ.ఎస్ స్టాండర్డ్స్ క్లబ్స్ ఏర్పాటు చేయాలి..

  • ప్రభుత్వానికి వినియోగదారుల ప్రతినిధుల విజ్ఞప్తి

రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో బి.ఐ.ఎస్ స్టాండర్డ్స్ క్లబ్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్, రాష్ట్ర అధ్యక్షుడు మామిడి భీం రెడ్డి, వినియోగదారుల మండలి అధ్యక్షుడు సాంబరాజు చక్రపాణి, రాష్ట్ర కార్యదర్శి అందె శ్రీధర్ రెడ్డి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికారి శ్రీకాంత్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలో బి.ఐ.ఎస్ స్టాండర్డ్స్ క్లబ్స్ ఏర్పాటు అత్యవసరతను వారు శ్రీకాంత్ కి వివరించారు.

విద్యార్థి దశలోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రాముఖ్యత, వస్తు నాణ్యత ప్రమాణాలు, ఐఎస్‌ఐ మార్క్ ప్రాముఖ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి స్టాండర్డ్స్ క్లబ్స్ కీలక వేదికలుగా మారుతాయని, వస్తు నాణ్యతపై సరైన అవగాహన ఉన్నప్పుడే భవిష్యత్‌లో వారు బాధ్యతాయుత వినియోగదారులుగా ఎదిగి, నాణ్యత లేని ఉత్పత్తుల నుండి తమను తాము రక్షించుకోగలరని విజ్ఞాపనపత్రం ద్వారా వివరించారు

- Advertisement -

దేశవ్యాప్తంగా ప్రతి వస్తువుకు బి.ఐ.ఎస్ నిర్దేశించిన ప్రమాణాలు ఖచ్చితంగా అమలు కావాలంటే విద్యార్థి స్థాయి నుంచే అవగాహన అవసరమని, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో స్టాండర్డ్స్ క్లబ్స్‌ను క్రియాశీలకంగా ఏర్పాటు చేసి, పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని బి.ఐ.ఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికారి శ్రీకాంత్ ని కోరారు అదేవిధంగా వస్తు నాణ్యత, ప్రమాణాలపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారి ద్వారా విద్యార్థులకు స్టాండర్డ్స్ క్లబ్స్ ద్వారా అవగాహన కల్పించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్టాండర్డ్ క్లబ్స్‌ను ఏర్పాటు విషయమై చర్చించారు.

బి.ఐ.ఎస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికారి శ్రీకాంత్ వివరిస్తూ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వ పాఠశాలలో స్టాండర్డ్స్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటుచేసే ప్రయత్నం జరిగిందని వాటిని మళ్లీ కార్యరూపం దాల్చే విధంగా తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.

స్టాండర్డ్స్ క్లబ్స్ ప్రయోజనాలు :

విద్యార్థుల్లో నాణ్యతపై అవగాహన పెంపు.. ఐఎస్‌ఐ మార్క్, హాల్‌మార్క్ వంటి గుర్తుల ప్రాముఖ్యతపై అవగాహన.. శాస్త్రీయ దృక్పథం, ప్రమాణాల పట్ల బాధ్యతాభావం, భవిష్యత్‌లో బాధ్యతాయుత వినియోగదారుల తయారీ.. ‘వోకల్ ఫర్ లోకల్’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాలకు బలమైన మద్దతు..

ప్రభుత్వం విద్యాశాఖ, బి.ఐ.ఎస్, వినియోగదారుల సంఘాల సమన్వయంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలో బి.ఐ.ఎస్ స్టాండర్డ్స్ క్లబ్స్‌ను ఏర్పాటు చేస్తే విద్యార్థుల భవిష్యత్తుకు తోడు, సమాజంలో నాణ్యతా సంస్కృతి బలపడుతుందని వినియోగదారుల ప్రతినిధులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News