Homeవరంగల్‌Wardhannapet MLA | పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

Wardhannapet MLA | పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.

  • పార్టీలకు అతీతంగా దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం.
  • ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని ఇల్లంద గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆబర్ల కనకమ్మ -వెంకటయ్య, పుల్లా భాగ్య లక్ష్మి -సుధాకర్, మంద ఎల్లెంద్రా -భాస్కర్ ఇండ్లకు ముగ్గుపోసే కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలియజేశారు.

Indiramma Housing Program Wardhannapet

ఇందిరమ్మ ఇండ్లు కట్టుకో లేని వారి కోసం ఒక కంపెనీతో మాట్లాడినట్లు తెలుపుతూ, ఇండ్లు మంజూరైన ప్రతి ఒకరు ఇండ్లు కట్టుకొని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచనలు చేశారు.

- Advertisement -
Indiramma Housing Program Wardhannapet1

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని అన్నారు. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. లబ్ధిదారులకు విడుదలవారీగా రూ 5లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు.

Indiramma Housing Program Wardhannapet3

అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఉచిత ఇసుకను పంపిణీ చేస్తామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దని, ఎవరైనా తీసుకుంటే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామాలు లేవని, పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇండ్లను నిర్మించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News