- జిల్లా ఎస్పీ డి సునిత రెడ్డి..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శాంతిభద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నామని, కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన మూడంచెల భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ డి సునిత రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత, పెబ్బేరు, మున్సిపాలిటిలలో కౌంటింగ్ కేంద్రాల వద్ద 850 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన మూడంచెల భారీ భద్రత ఏర్పాటు చేశామని. అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు అనుమతి లేదని, సంబంధిత అధికారులు నిర్దేశించే తేదీల్లో మాత్రమే విజయోత్సవాలు జరుపుకోవాలి లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతలు కాపాడేందుకు మరియు ఎలాంటి అసాంఘిక చర్యలు చోటుచేసుకోకుండా చూసేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు, కౌంటింగ్ కేంద్రాల వెలుపల 163 BNS (144 సెక్షన్) అమలులో ఉంటుందని అన్నారు.
లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు, క్యూ.ఆర్.టి టీంలు, డాగ్ స్క్వాడ్ టీమ్స్, బాంబు డిస్పోసల్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచామని.. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజలకు, అభ్యర్థులకు, గెలిచిన వారిని ఉద్దేశించి ఎస్పీ ముఖ్య సూచనలు జారీ చేశారు.
ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే, లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి, శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని .. ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడాలని, ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
