Sunday, March 1, 2026
Homeమెదక్‌GO 25 | జీఓ 25 సవరణ తరువాతే రేషనలైజేషన్ ప్రకియ చేపట్టాలి

GO 25 | జీఓ 25 సవరణ తరువాతే రేషనలైజేషన్ ప్రకియ చేపట్టాలి

  • సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్జిటియు) డిమాండ్

రేషనలైజేషన్ కంటే ముందు జీఓ 25ను సవరణ చేసి రేషనలైజేషన్ ప్రకియను మొదలు పెట్టాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్జిటియు) నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జీఓ 25ను సవరించి విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తిని తగ్గించిన తరువాతనే రేషనలైజేషన్ ప్రక్రియను చేపట్టాలి అని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్ , విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాలకి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1 నుండి 20 వరకు విద్యార్థులు నమోదైన ప్రతి పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. 20 నుండి 40 వరకు విద్యార్థులు నమోదైన ప్రతి పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులను నియమించాలి. 40 నుండి 60 వరకు విద్యార్థులు నమోదైన ప్రతి పాఠశాలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున నియమించాలి. 60 మంది విద్యార్థులకన్నా ఎక్కువమంది నమోదై ఉన్న పాఠశాలలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడితో పాటు అట్టి పాఠశాలలకు అధనంగా ప్రధానోపాధ్యాయుడిని నియమించాలి.

- Advertisement -

ఏదైనా ఒక పాఠశాలలో ఉపాధ్యాయులు ధీర్ఘకాలిక సెలవులపై వెళ్ళినప్పుడు అట్టి ఉపాధ్యాయుల స్థానంలో తాత్కాలికంగా పనిచేయుటకు అధనపు ఉపాధ్యాయు కనీసం మండలానికి ఐదుగురు అధనంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక పాఠశాలలే విద్యార్థుల భవిష్యత్తుకు ముఖ్యభూమిక పోషిస్తాయి, కాబట్టి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా తగుజాగ్రత్తలు వహించి బంగారు భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదద్దే విధంగా ప్రాథమిక పాఠశాలలను రూపొందించుటకు అవసరమైన సూచనలను పరిగణలోనికి తీసుకొని జీఓ 25 లో తగిన మార్పులు చేయవల్సిందిగా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని కోరుచున్నామని తెలిపారు.

టెట్ లో అందరి ఉపాధ్యాయులకు అర్హత మార్కులు సమానంగా తమిళనాడు,బీహార్ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాన్ని 50శాతం అమలుపరుచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్ రెడ్డి, అరికెల వెంకటేశం మరియు యదాద్రి అధ్యకవెంకటేశ్వర్ప

- Advertisement -
RELATED ARTICLES

Latest News