- గ్రామమే దేవాలయం..
- పారిశుద్ధ్యమే పరమావధి!
- మురుగు కాలువలలో దిగి పూడిక తీత
- గ్రామంలో వెల్లువెత్తిన ప్రశంసలు
అధికారంలో అంటే కుర్చీలో కూర్చొని గ్రామంలో ఉన్న వారికి ఆదేశాలు జారీ చేయడం కాదు… వారితోపాటు ప్రజాసేవలో భాగస్వామి అని ఓ.. గ్రామ సర్పంచ్ నిరూపించారు. గ్రామాన్ని శుభ్రమైన గ్రామంగా _ఆరోగ్యవంతమైన సమాజం అనే లక్ష్యంతో ఆయన స్వయంగా ఆయన స్వయంగా గ్రామంలో చేత పారపట్టి మురికిని శుభ్రం చేస్తూ పారిశుద్ధ్య కార్మికుడగా అవతారం ఎత్తారు.

గ్రామంలో పేరుకుపోయిన చెత్తను మురికి కాలువలను శుభ్రం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. పూర్తి వివరాల్లోనికి వెళ్తే జగదేవపూర్ మండలంలోని బిజీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ చెక్కల పరమేశ్వర్ గురువారం రోజున గ్రామంలో వీధి వీధి గుండా తిరిగి ఎక్కడెక్కడ చెత్తాచెదారం ఉందో పరిశీలించారు. అనంతరం గ్రామంలో తోటి వార్డు మెంబర్లతో కలిసి గ్రామ పంచాయతీ కార్మికులతో కలసి చెత్తాచెదారాన్ని తీసే పనిలో పడ్డారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేవలు అందించాలన్నదే తన ముఖ్య ఆశయమని గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్న వీలైనంత తొందరలో తీరుస్తానని అన్నారు. నమ్మకంతో ఎన్నుకున్న ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు అందిస్తానని తన పదవి కంటే ప్రజలే ముఖ్యమని తెలిపారు. పారపట్టి మురికి కాలువను శుభ్రం చేస్తు గ్రామ ప్రజలకు ఆదర్శంగా లేచారు.
