Tuesday, February 10, 2026
Homeనల్లగొండAlair | 12వ వార్డును దత్తత తీసుకోని అభివృద్ధి చేస్తా

Alair | 12వ వార్డును దత్తత తీసుకోని అభివృద్ధి చేస్తా

  • బీఆర్ఎస్ అభ్యర్థి – మోర్తల సునీతా రమణా రెడ్డి

ఆలేరు మున్సిపల్ పట్టణం లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రచార జోరు పెంచారు 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మోర్తాల సునీతా రమణా రెడ్డి,వార్డులో ని ప్రధాన సమస్యలపై గత హయాంలోనే 1.20 లక్షల తో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇతర అభివృద్ధి పనులు చేశామని చేయాల్సిన పనులు ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయని వార్డు అభివృద్ధి కోసం మరొక సారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఓటర్లను కోరారు సునీతా రమణా రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 12వ వార్డులో ఒక రూపాయి అభివృద్ధి పనులకు నోచుకోలేదని ఆరోపించారు

ప్రజల ఆశీర్వాదం తో తాము గెలిచిన వెంటనే మన్నే వాడను దత్తత తీసుకుంటామని అన్నారు మన్నేవాడ ను గత హయాంలో అధికారులు చేసిన తప్పిదాల వలన అభివృద్ధి ఆలస్యం అయ్యిందని ఇపుడు మన్నే వాడ ను అభివృద్ధి చేయడం కోసం ఎ ఆటంకం లేదని తాము గెలిచిన 6 నెలల్లో ప్రజలు కోరిన సీసీ రోడ్లు డ్రైనేజీలు తమ సొంత నిధులతో, దాతల సహకారం తో నిర్మిస్తామని హామీ ఇచ్చారు

- Advertisement -

సునీతా రమణా రెడ్డి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన స్థానిక అభివృద్ధి, రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రజల వద్దకు వెళ్తున్నామని 12వ వార్డు ఎన్నికల్లో అందరి నాయకుల కార్యకర్తల సమన్వయం తో ముందుకు వెళ్తుమాన్నామని అన్నారు అభ్యర్థి మోర్తాల సునీతా రమణా రెడ్డి…

- Advertisement -
RELATED ARTICLES

Latest News