Thursday, February 26, 2026
Homeహైదరాబాద్‌Telangana | వికలాంగులకు శుభవార్త

Telangana | వికలాంగులకు శుభవార్త

  • ముత్తినేని వీరయ్య వికలాంగుల కో -ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ వికలాంగుల కో ఆపరేటివ్ కార్పొరేషన్ ఉచితంగా మొబైల్ బిసినెస్ బ్యాటరీ ట్రై సైకిల్, ల్యాప్ టాప్ లు, బ్యాటరీ వీల్ చైర్లు, ట్యాబ్ లు, 5జి స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందించడానికి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ లు కోరుచున్నది

ఈ నెల 10 వ తేదీని చివరి తేదిగా నిర్ణయించడం జరిగింది

- Advertisement -

ఇంతకు ముందు అప్లై చేసి అవకాశం రాని వారు కుడా ఇప్పుడు మరల అప్లై చేసుకోవచ్చు

1) బ్యాటరీ వీల్ చైర్ వీటి కోసం అప్లై చేసుకోవాల్సిన వ్యక్తులు మస్కూలరీ డిస్ట్రోఫీ, వ్యక్తులు వైకల్య శాతం 40 అంతకంటే ఎక్కువ ఉన్నవారు అలాగే శారీరక వికలాంగులు అయితే 80% అంతకంటే ఎక్కువ ఉన్నవారు వయసు 12 సంవత్సరాలు నుండి 55 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడంతో చివరి తేదీ ఫిబ్రవరి 10 /2026.

2)మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిల్ చదువుతో నిమిత్తం లేకుండా చదువుకొని వారు కూడా అప్లై చేసుకోవచ్చు
ఇది వికలాంగులు చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థికంగా నిలబడడానికి ఉపయోగ పడుతుంది

వీటికోసం శారీరక వికలాంగులు వైకల్య శాతం 40 శాతం అంతకంటే ఎక్కువ కలిగినటువంటి వ్యక్తులు 18 నుండి 55 సంవత్సరాల కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు దీనికి కూడా . చివరి తేదీ ఫిబ్రవరి 10/ 2026.

3) హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ వీల్ చైర్వీ టికోసం శారీరిక వికలాంగులు*
ఇంటర్మీడియట్ ఆపై చదువులు కలిగిన వైకల్య శాతం 40 శాతం అంతకంటే ఎక్కువ కలిగిన 18 నుండి 55 సంవత్సరాల వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు చివరి తేదీ ఫిబ్రవరి 10 /2026

4) లాప్టాప్ వినికిడి లోపం, దృష్టి లోపం ఉన్న వ్యక్తులు అర్హులు వీటి కొరకు దరఖాస్తు చేసుకునే వ్యక్తులు డిగ్రీ 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు అర్హులు. చివరి తేదీ.ఫిబ్రవరి 10/ 2026

5) లాప్టాప్ లు శారీరక వైఖల్యం, వినికిడి లోపం, దృష్టి లోపం ఉన్న వ్యక్తులు అర్హులు
పీజీ కి సమానమైన కోర్సులు మరియు ఆపై చదువులు చదువుతున్న వ్యక్తులు వైకల్య శాతం 4o శాతం మరియు అంత కంటే ఎక్కువ కలిగిన 18-55 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోగలరు. చివరి తేదీ ఫిబ్రవరి 10/ 2026

6) టా ప్స్ వినికిడి లోపం, దృష్టి లోపం ఉన్న వ్యక్తులు అర్హులు వీటి కోసం దరఖాస్తు చేసుకున్నఇంటర్మీడియట్ కోర్సు చదువుతున్న 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులు అర్హులు . చివరి తేదీ ఫిబ్రవరి 10 /2026.

7) 5 జి స్మార్ట్ ఫోన్లు వీటి కోసం దరఖాస్తు చేసుకునేవారు వి హెచ్50 శాతం హెచ్ హెచ్ (51 శాతం పదవ తరగతికి సమాధానం చదువుపూర్తి చేసి ఉన్న కానీ చదువుతున్న వ్యక్తులు రెండు సంవత్సరాలు వ్యవధి వరకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి 16 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు దరఖాస్తు అర్హులు చివరి తేదీ ఫిబ్రవరి 10/ 2026

ఈ అప్లికేషన్ లో మీకు ఏమైనా సమస్యలు వచ్చిన యెడల చైర్మన్ కార్యాలయం ఇంచార్జి రజిని 9959583502 కి ఉదయం 10 గంటలు నుండి సాయంత్రం 6గంటల వరకు సంప్రదించగలరు

- Advertisement -
RELATED ARTICLES

Latest News