- పర్వతగిరి ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్.
- పర్వతగిరి సి.ఐ బి.రాజగోపాల్.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలను స్థానిక ఎంపీడీవో మాలోత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని అన్నారు. బుధవారం జరిగిన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పర్వతగిరి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిధులుగా పర్వతగిరి ఎంపిడీఓ మాలోత్ శంకర్ నాయక్, ఎంఈఓ బిక్షపతి, ఆర్.ఐ కస్నా నాయక్, పర్వతగిరి సర్పంచ్ చీదురు శంకర్, పర్వతగిరి సీ.ఐ రాజగోపాల్, పర్వతగిరి మండల సీఎం కప్ క్రీడల ఇంచార్జి పి. అనిల్, వరంగల్ జిల్లా పీఈటి అసోసియేషన్ అధ్యక్షులు ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంఈఓ బిక్షపతి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పర్వతగిరి సీఐ రాజగోపాల్ మాట్లాడుతూ క్రీడలు కేవలం విశ్రాంతి కొరకు, మానసికోల్లాసం కొరకు మాత్రమే కాకుండా విద్యార్థులకు ఉద్యోగ నియామకాల్లో అవకాశాలను కూడా సృష్టిస్తాయని, కాబట్టి క్రీడలను నిర్లక్ష్యం చేయవద్దని అన్నారు.

వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులకు సంబంధిత క్రీడల్లో పోటీలు నిర్వహించి వారిని జిల్లా స్థాయికి ఎంపికలు చేయడం జరుగుతుందని పీడీ లు అనిల్, వెంకటేశ్వర్లు తెలిపారు. క్రీడాకారుల ఎంపికలో పర్వతగిరి మండలంలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న పీడీ లు పీఈటీ లు పాషా, విజయలక్ష్మి, అపర్ణ, సురేష్, చందూలాల్, స్వప్న, స్రవంతి, వేణు, సురేష్, అశ్వినీ పాల్గొన్నారు

