- సూచించిన మాజీ.కార్పొరేటర్ స్వరూప గౌడ్..
ప్రధానమంత్రి ఖేలో భారత్ ఆటల పోటీలలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ ఆధ్వర్యంలో పార్సిగుట్ట, అంబర్ నగర్ ప్రాంతాలలో మహిళల కొరకు మ్యూజికల్ చైర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో స్వరూప గౌడ్ మాట్లాడుతూ.. మహిళలకు ఆటలు ఉపశమనం ఇస్తాయని అన్నారు.. ఆరు గ్రూపులుగా ఆటలు ప్రారంభించి ఒక్క గ్రూపులో 30 మంది సభ్యులను చేర్చుకొని గ్రూపుల వారీగా ఆటలను ప్రారంభించడం జరిగిందని అతిథిగా పాల్గొన్న మహిళా మోర్చా సికింద్రాబాద్ కన్వీనర్ కళావతి తెలిపారు..
అనంతరం గెలుపు పొందిన వారికి ప్రథమ, ద్వితీయ బహుమతులను మేమంటోలను అందజేశారు.. అలాగే వారికి క్రీడలో ఉత్తీర్ణ పత్రాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారా అందజేయడం జరుగుతుందని మరో అతిధి మహిళా మోర్చా జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మీ పద్మజ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షులు సాయి ప్రసాద్ గౌడ్. బస్తీ అధ్యక్షులు ఓం ప్రకాష్ ముదిరాజ్, సరిత, అమరావతి, నాగమణి, సుశీల, రమ, స్వాతి, శరణ్య సాయి, సుధా పల్లవి, శ్యామల, భవాని, చంద్రకళ, రాజమణి, పద్మ, రజిత, లావణ్య, చందన, సింధు, వాణి, జయంత్, సురేష్, సతీష్ నేత, రాజు గౌడ్, రూప్ సాయి తదితరులు పాల్గొన్నారు.
